తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలానికి చెందిన వైకాపా నాయకులు మాజీఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెదేపా కండువాలు కప్పి ఆమె వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో తెదేపాకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు.
తెదేపా గూటికి వైకాపా కార్యకర్తలు - తెదేపా తూర్పు గోదావరి వార్తలు
పంచాయతీ ఎన్నికల వేళ ఇతర పార్టీల్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో పలువురు వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

తెదేపా గూటికి వైకాపా నాయకులు