ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా శ్రేణుల మధ్య భగ్గుమన్న విభేదాలు - వైకాపా నేతల మధ్య వర్గ విభేదాలు

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో తమను సభా వేదికపైకి పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు.

వైకాపా శ్రేణుల మధ్య  మరోసారి భగ్గుమన్న విభేధాలు
వైకాపా శ్రేణుల మధ్య మరోసారి భగ్గుమన్న విభేధాలు

By

Published : Nov 25, 2020, 8:08 PM IST

Updated : Nov 25, 2020, 10:20 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా శ్రేణుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పిఠాపురంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన జగనన్న తోడు కార్యక్రమంలో... ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరవుతారనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే రాలేదు. వైకాపా పట్టణ అధ్యక్షుడు బొజ్జా రామయ్య వేదికపై కూర్చోవాలంటూ... నాయకుల్ని పేరుపేరునా ఆహ్వానించారు. అయితే తమ పేరు పిలవలేదంటూ ఖండవల్లి లోవరాజు.... రామయ్యను నిలదీశారు. వేదిక కింద ఉన్న నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. తీవ్ర ఆగ్రహంతో తోసుకున్నారు. మరికొంత మంది నాయకులు కలగజేసుకొని సర్దిచెప్పారు.

వైకాపా శ్రేణుల మధ్య మరోసారి భగ్గుమన్న విభేధాలు
Last Updated : Nov 25, 2020, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details