తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కరోనా యోధులకు వైకాపా నేతలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 700 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లు, పారిశుద్ధ్య సిబ్బందిని సత్కరించారు. అందరికి శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి జన్మదినోత్సం సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు.
రాజమహేంద్రవరంలో కరోనా యోధులకు సన్మానం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 700 మంది కరోనా యోధులను వైకాపా నాయకులు సన్మానించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి జన్మదినోత్సం సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. తమది ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రభుత్వమని తెలిపారు.
కరోనా యోధులకు సన్మానం
మంత్రులు విశ్వరూప్, వేణు గోపాలకృష్ణ, శ్రీరంగనాథ రాజు, ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తమది ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రభుత్వమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. 59 బీసీ కులాలను గుర్తించి 56 కార్పొరేషన్ పదవుల్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాలు తీర్చడానికే'