అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందించి వైకాపా ప్రభుత్వం ప్రపంచ రికార్డు స్పష్టించబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట గొల్లపుంతలో సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును అమలాపురం ఎంపీ చింతా అనురాధతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. కరోనా పట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో కేసులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. వైరస్ పట్ల భయం అక్కర్లేదని, అప్రమత్తంగా ఉంటే చాలని మంత్రి పేర్కొన్నారు.
'వైకాపా ప్రభుత్వం ప్రపంచ రికార్డు స్పష్టించబోతుంది' - వైకాపా ప్రభుత్వం ప్రపంచ రికార్డు
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ అన్నారు. ఇది యావత్ ప్రపంచంలోనే రికార్డు కాబోతుందని... ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం సీఎం జగన్కు తప్ప ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నారు.
pilii subash