రాజమహేంద్రవరంలో వ్యాక్సినేషన్‌పై వైకాపా సమన్వయకర్త ఆకుల సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరపాలక అధికారులు టీకా పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడం లేదని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో రెండో డోసు వ్యాక్సిన్ కోసం వేల మంది నిరీక్షిస్తున్నారన్న సత్యనారాయణ... అర్బన్ హెల్త్ సెంటర్లు స్టోర్ రూమ్‌గా మారినా అడిగేవారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ సెంటర్లలో వైద్యసేవల పేరుతో ధనూష్ సంస్థ దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ విషయాన్ని సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
వ్యాక్సినేషన్‌పై వైకాపా సమన్వయకర్త సత్యనారాయణ అసంతృప్తి
రాజమహేంద్రవరంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని నగరపాలక అధికారులు పర్యవేక్షించడం లేదని వైకాపా సమన్యయకర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో రెండో డోసు వ్యాక్సిన్ కోసం వేల మంది నిరీక్షిస్తున్నారని ఆకుల సత్యనారాయణ అన్నారు.
వైకాపా సమన్వయకర్త సత్యనారాయణ