ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక సమరం... వైకాపా, తెదేపా పోటాపోటీ ప్రచారం - panchyathi elections news

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా, తెదేపా శ్రేణులు పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, కిర్లంపూడి మండలాల్లో ఇరుపార్టీల నేతలు జనాల్లోకి వెళ్తున్నారు. గెలుపుపై ధీమాగా ఉన్నారు.

ycp and tdp election campign in east godavari
స్థానిక ఎన్నికల్లో వైకాపా, తెదేపా శ్రేణులు పోటాపోటీగా ప్రచారం

By

Published : Feb 7, 2021, 5:20 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైకాపా, తెదేపా శ్రేణులు పోటాపోటీ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, ఎంపీ వంగా గీత... గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ వారు బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. పర్వత ఒమ్మంగిలో ప్రజలను కలిశారు. ప్రభుత్వ పథకాలు చూసి ఓటు వేయాలి అని ప్రజలను అభ్యర్థించారు. తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ వరుపుల రాజా సైతం తన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తాము బలపరిచిన వారిని గెలిపించాలి అని ప్రజలను కోరారు.

కిర్లంపూడి మండలంలో తెదేపా, వైకాపా జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. జగపతినగరం, ముక్కోలు, గోనెడ, ఏలంక గ్రామాల్లో తెదేపా బలపరిచిన అభ్యర్థులు విజయంపై ధీమాగా ఉన్నారు. వైకాపా శ్రేణులు సైతం తమ అభ్యర్థులును గెలిపించుకోవాలన్న పట్టుదల ప్రదర్శిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఎంపీ వంగా గీత వైకాపా బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. తెదేపా సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details