ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి' - తుర్పుగోదావరిలో వైకాపా ఆగడాలు

వైకాపా నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయని.. అధికారం శాశ్వతం కాదన్న నగ్నసత్యాన్ని గ్రహించాలని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. శంఖవరం మండల భాజపా ఉపాధ్యక్షుడిపై వైకాపా నాయకుల దౌర్జన్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ycp activities attack on bjp leader
వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి

By

Published : Dec 1, 2020, 7:28 PM IST

వైకాపా నాయకుల పిరికిపంద దాడులు, రౌడీయిజానికి భయపడే ప్రసక్తే లేదని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలో భాజపా నాయకునిపై వైకాపా నేతల దౌర్జన్యాన్ని ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన అప్పికొండ జోగిబాబుపై వైకాపా నాయకులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. గతంలోనూ ఈ తరహా దాడులు జరిగాయని గుర్తు చేశారు. వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని.. అధికారం శాశ్వతం కాదన్న నగ్నసత్యాన్ని వాళ్లు గ్రహించాలన్నారు.

తన సొంత మండలంలో జరుగుతున్న దాడులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ బాధ్యత వహించాలన్నారు. ఈ దాడికి కారకులైనా వాళ్లపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా ఎస్పీని కోరారు.

ABOUT THE AUTHOR

...view details