ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా కనుసన్నల్లో పోలీసులు: వంతల రాజేశ్వరి - vanthla rajeswari news

పోలీస్ శాఖ వైకాపా కనుసన్నలో నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు.

ycp activists destroyed the tdp flexi in Rampachodavaram
వైకాపా ఆగడాలపై తెదేపా మాజీ ఎమ్మెల్యే ధ్వజం

By

Published : Dec 30, 2020, 7:43 AM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పోలీస్ శాఖ వైకాపా కనుసన్నల్లో పనిచేస్తోందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ధ్వజమెత్తారు. ఈ నెల 22న అడ్డతీగల తెదేపా సమావేశానికి వచ్చినవారికి స్వాగతం పలుకుతూ గంగవరం మండలం జడేరులో మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైకాపా కార్యకర్తలు చించేశారని ఆరోపించారు.

ఈ ఘటనపై గంగవరం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా.. ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని ఆగ్రహించారు. గిరిజన మహిళ అయిన తీగల ప్రభపై వైకాపా నాయకులు దుర్భాషలు ఆడడం దారుణమన్నారు. ఈ విషయమై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అవసరమైతే ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details