'ఇప్పటి దాకా ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి' - ప్రభుత్వ పాలనపై మాట్లాడిన యనమల రామకృష్ణుడు
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. ఏ స్థాయిలో ప్రజలకు హామీలు అమలయ్యాయో తెలపాలని డిమాండ్ చేశారు.
!['ఇప్పటి దాకా ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి' 'ఇప్పటి దాకా ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5238726-694-5238726-1575224502919.jpg)
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తైనా... ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. 86 శాతం హామీలు పూర్తయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ హామీలు పూర్తి చేశారో... ఏ హామీలు నెరవేర్చారో... ఎంత డబ్బు ఖర్చు పెట్టారో... వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎన్నో హామీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. నవరత్నాల పథకం అమలు చేయాలంటే రూ.62 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆనాడే చెప్పామన్నారు. బడ్జెట్లో అంత ఖర్చు లేనప్పుడు ఎక్కడ నుంచి తీసుకొని వస్తారనేది... ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు.