యానాంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ వాడపల్లి గోపాలాచార్యులు.. శిష్య బృందం స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున.. స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి మంగళ సూత్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం అధ్యక్షులు కాపు గంటి ఉమాశంకర్ దంపతులు.. మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజ దంపతులు సమర్పించారు.
యానాంలో ఎన్నికలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా... భక్తులు తక్కువ సంఖ్యలోనే హాజరయ్యారు. కళ్యాణం అనంతరం వారికి నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. యానాంలోని రెడ్డి రాజుల కాలంలో ప్రతిష్టించబడిన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. మీసాల వెంకన్నగా.. చద్దుకూడు వెంకన్నగా పరిసర గ్రామ జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజలు స్వామివారిని పిలుచుకుంటారు.