హైదరాబాద్ నుంచి యానాం వచ్చిన తన కొడుకు వివరాలు చెప్పనందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. సదరు వ్యక్తి కుమారునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వల్ల తండ్రిపై విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు యానాం ఇంఛార్జీ ఎస్పీ చోడిశెట్టి రాధాకృష్ణ తెలిపారు.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చినప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వనందుకు తండ్రిపై చర్యలు తీసుకున్నట్లు ఇంఛార్జీ ఎస్పీ వివరించారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారు తప్పనిసరిగా ఈ - పాస్ తీసుకుని ప్రభుత్వ అనుమతి పొంది రావాలని స్పష్టం చేశారు.