తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానంలో ఈ నెల ఒకటి నుంచి నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులపై 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి స్థానిక శాసనసభ్యుడు, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తక్షణం స్పందించారు. పాండిచ్చేరి నుంచి యానం చేరుకున్న మంత్రి ఉదయం యానంలో రహదారులపై ఉన్న చెత్తను పరిశీలించారు.
18 ఏళ్లుగా యానంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ యాజమాన్యంతో మాట్లాడారు. యానం పారిశుద్ధ్యంపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామితో చర్చించామని, ప్రభుత్వం సంస్థకు బాకీ పడిన 80 లక్షలు చెల్లించేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.