క్రిస్మస్ ను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని రోమన్ క్యాథలిక్ చర్చ్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు.. భారీ క్రిస్మస్ ట్రీ.. క్రీస్తు జన్మించిన ప్రదేశాన్ని తలపించే సెట్టింగులతో తీర్చిదిద్దారు. 1768 సంవత్సరంలో ఫ్రెంచివారి హయాంలో నిర్మించిన చర్చ్ కావడంతో ఎంతో ప్రఖ్యాతగాంచింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
సర్వాంగసుందరంగా ముస్తాబైన యానాం చర్చ్ - తూర్పుగోదావరి జిల్లా తాజా సమాచారం
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగమైన కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని... రోమన్ క్యాథలిక్ చర్చ్ లో క్రీస్తు జన్మదిన వేడుకలకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రధానమందిరాన్ని ముస్తాబు చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
క్రిస్మస్ వేడుకలకు సర్వాంగసుందరంగా ముస్తాబైన... యానాం చర్చ్