ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శనివారం నుంచి తెరుచుకోనున్న అయినవిల్లి శ్రీసిద్ధి వినాయక ఆలయం

కరోనా వైరస్ కారణంగా పలు దేవాలయాలు, మందిరాలు మూసేశారు. ఈ క్రమంలోనే మార్చి 22న అయినవిల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సిద్ధి వినాయక ఆలయం మూతపడింది. తిరిగి 4 నెలల తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయని ఆలయాధికారులు తెలిపారు. శనివారం నుంచి వివిధ పూజలు జరపనున్నారు. ఈ మేరకు భక్తుల దర్శనం కోసం ట్రయల్ రన్​ను నిర్వహించారు.

రేపటినుంచి అయినవిల్లి  శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో పూజలు
రేపటినుంచి అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో పూజలు

By

Published : Aug 7, 2020, 10:35 PM IST



తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో 4 నెలల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు. 2 నెలల క్రితం ఆలయాలు తిరిగి తెరుచుకున్న ఈ గుడిని మాత్రం తెరవలేదు. ఆలయం ఉన్న ప్రదేశంలో రెడ్ జోన్ కారణంగా భక్తులకు ప్రవేశం లేకుండా పోయింది. 4 నెలల అనంతరం శనివారం నుంచి భక్తులు దర్శనం చేసుకునేలా అనుమతులు ఇస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం పి. గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు ఇతర అధికారులతో సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల దర్శనం కోసం ట్రయల్ రన్​ను నిర్వహించారు. శనివారం నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని ఆలయ కార్యనిర్వాహక అధికారి పీ. తారకేశ్వరరావు తెలిపారు. రోజుకు 500 మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి దర్శనాలు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తాజాగా 247 మందికి పాజిటివ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details