తూర్పుగోదావరి జిల్లా.. యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని(World Fisheries Day celebrations at yanam) మత్స్యకారులు ఆదివారం ఉత్సాహంగా జరుపుకొన్నారు. స్థానిక గౌతమి గోదావరిలో ఏడు గ్రామాలకు చెందిన వారు పడవలతో రెండు గంటలపాటు వలయాకారంలో తిరుగుతూ బాణసంచా కాల్చుతూ విన్యాసాలు(World Fisheries Day celebrations at yanam) నిర్వహించారు.
పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భారీ ప్లెక్సీని బోటుకు ఏర్పాటుచేసి పాలాభిషేకం చేశారు. స్థానిక బెజవాడగార్డెన్‌లోనూ వేడుకలు(World Fisheries Day 2021) నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు శేరు కృష్ణ, ఎన్నార్ కాంగ్రెస్ యానాం అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.