తూర్పు గోదావరి జిల్లా యానాంలో... ఏడున్నరేళ్ళక్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త జి.ఎన్.నాయుడు యానాం విడిచి వెళ్లారు. సిరామిక్ టైల్స్ పరిశ్రమ డైరెక్టర్గా ఉన్న ఆయన.. యాజమాన్యం, కార్మికుల మధ్య విభేదాలతో మనస్తాపానికి గురయ్యారు. 2012 జనవరి 27న సంస్థలోని కార్మికులు పరిశ్రమను తగలబెట్టి నాయుడిని వెళ్లగొట్టారు. మనస్తాపంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన యానంలో అడుగుపెట్టలేదు. ఇటీవల కార్మికులతో కుదిరిన ఒప్పందంతో సమస్యను పరిష్కరించుకున్నారు. ఏడేళ్లపాటు ద్వేషిస్తూ వస్తున్న కార్మికులే నేడు ఆయనపై పూలు చల్లుతూ, తీన్మార్ డప్పులు వాయిస్తూ పరిశ్రమలోకి స్వాగతం పలికారు. ఈ పరిశ్రమ గతంలో ప్రత్యక్షంగా వెయ్యి మందికి పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి కల్పించింది.
అప్పుడు తరిమికొట్టారు.. ఇప్పుడు తీన్మార్ డప్పులతో తీసుకొచ్చారు
నాడు ద్వేషించిన వారే... నేడు పూలబాటతో స్వాగతం పలికారు. ఒకప్పుడు గెంటేసిన కార్మికులే ఇప్పుడు టెంటేసి సన్మానం చేశారు. తూర్పు గోదావరి జిల్లా యానాంలోని సిరామిక్స్ పరిశ్రమ కార్మికులు.. తమ డైరక్టర్ జీ.ఎన్.నాయుడును తీన్మార్ డప్పులతో ఆహ్వానించారు.
యజమానిని ఉరేగించిన సిరామిక్ కార్మికులు