Treadmill: తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన వడ్రంగి కళాకారుడు కడిపు శ్రీనివాస్ చెక్కలతో ట్రెడ్ మిల్ (వ్యాయామ యంత్రం) రూపొందించి అబ్బురపరిచారు. దీని తయారీకి మూడు రోజుల సమయం పట్టిందని.. రోజు వారీ పని చేసుకుంటూ ముందుగా కావలసిన టేకు చెక్కలు సిద్ధం చేసుకుని రాత్రి సమయంలో దీని రూపొందించినట్లు శ్రీనివాస్ చెప్పారు. ట్రెడ్ మిల్లు తిరగడం కోసం 60 బాల్ బేరింగ్‌లు ఉపయోగించానని, మొత్తంగా దీని తయారీకి రూ.12వేలు ఖర్చయిందని తెలిపారు.
పరికరం పని తీరుపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మెచ్చుకుని కళాకారుడిని గుర్తించి, సాయం చేయమని ట్వీట్ చేయడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తెలంగాణ మంత్రులు కొందరు ఫోను చేసి వివరాలు తెలుసుకున్నారని శ్రీనివాస్ ఆదివారం తెలిపారు.