ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగారు సత్తెమ్మను మళ్లీ గెలిపించారు! - eastgodavari district newsupdates

ఆమె వ్యవసాయ కూలీ. పని తప్ప అక్షర జ్ఞానం, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. కానీ రెండోసారి సర్పంచిగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలానికి చెందిన సత్యవతి అభివృద్ధిలోనూ తన ముద్రను వేశారు.

Won again as the bangaru Sattemma sarpanch
బంగారు సత్తెమ్మను మళ్లీ గెలిపించారు!

By

Published : Feb 15, 2021, 8:02 AM IST

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామానికి శనివారం రెండోసారి సర్పంచిగా ఎన్నికయ్యారు. వ్యవసాయ కూలి పని తప్ప అక్షర జ్ఞానం, రాజకీయ నేపథ్యం లేని సత్యవతి.. 2013 ఎన్నికల్లో గ్రామస్థుల అభ్యర్థనపై తొలిసారి బరిలో నిలిచి గెలిచారు. ఊళ్లో బడికి రూ.57 లక్షల నిధులు సాధించి బాగు చేయించారు. అభివృద్ధిలో తన మార్కు చూపించారు. 2,652 ఓట్లు ఉన్న ఈ ఊరికి సత్యవతిని గ్రామస్థులు రెండోసారి గెలిపించారు. ‘మంచి పనులు చేసినందుకు గ్రామస్థులు రూపాయి ఖర్చులేకుండా నన్ను గెలిపించారు. కూలీ పని నాకు నమోషీ కాదు. అర్ధ రూపాయి కూలీ ఉన్నప్పటి నుంచీ నేను చేసే పని ఇదే. ఊరిలో విద్య, వైద్యానికి సౌకర్యాలు పెంచడం నా లక్ష్యం’ అని చెబుతున్నారు సత్యవతి.

ఇదీ చదవండి:

మూడేళ్లకొకసారే పెళ్లి బాజాలు.. తమ ఊరివారితోనే వివాహ సంబంధాలు

ABOUT THE AUTHOR

...view details