ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణం యజమాని చేయి చేసుకున్నాడని మహిళల ఆందోళన - east godhavari

జనావాసాల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దన్నందుకు షాపు యజమాని తమపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ.. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట కోనేటి చెరువు వద్ద స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు.

మద్యం దుకాణం యజమాని చేయి చేసుకున్నాడని మహిళలు ఆందోళన

By

Published : Sep 29, 2019, 10:47 PM IST

మద్యం దుకాణం యజమాని చేయి చేసుకున్నాడని మహిళలు ఆందోళన

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట లోని కోనేటి చెరువు వద్ద ఎక్సైజ్ పోలీసులతో గ్రామానికి చెందిన మహిళలు వాగ్వాదానికి దిగారు. తమ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దు అని అన్నందుకు... యజమాని తమపై చేయి చేసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. యజమానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనతో... ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వారిపై తగు చర్యలు తీసుకుంటామన్న జగ్గంపేట సీఐ రాంబాబు హామీతో మహిళలు ఆందోళన విరమించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details