తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ పట్ల ఎస్సై దురుసుగా ప్రవర్తించడం వల్లే.. ఆ వ్యక్తి దూషించాడని మహిళా సంఘాలు నేతలంటున్నారు.
నాలుగు రోజుల క్రితం వొమ్మంగి గ్రామంలో ఓ స్థల వివాదం జరుగుతుంటే.. ప్రత్తిపాడు ఎస్సై రవికుమార్ అక్కడికి వెళ్లాడు. వివాద ఘటనను ఓ మహిళ మొబైల్లో చిత్రీకరించింది. ఎస్సై చూడడంతో ఆమె చరవాణిని దుస్తులలో దాచిపెట్టింది. అది గమనించిన అతను అక్కడికి వెళ్లి ఆమె దుస్తుల్లో దాచిపెట్టిన మొబైల్ తీసుకున్నాడు. అంతేగాక ఇష్టమొచ్చినట్లు తిట్టాడని బాధితురాలు కన్నీరుమున్నీరయింది. అందరూ చూస్తుండగానే ఎస్సై ఇలా చేశాడని, అది చూసిన తన భర్త తనను పుట్టింట్లోనే వదిలేసి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.