తూర్పుగోదావరి జిల్లా పండూరు గ్రామానికి చెందిన గంగాధరంతో కాకినాడకు చెందిన సత్యవేణికి 15 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. గత కొద్ది కాలంగా అదనపు కట్నం కోసం ఆమెను భర్త, అత్తింటివారు వేధించారు. ఇబ్బందులు తట్టుకోలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం పెద్దల పంచాయతీల ో గొడవ సద్దుమణిగి సత్యవేణి తిరిగి పుట్టింటికి తిరిగి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె నెల రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అత్తింటి వారు తెలిపారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన సత్యవేణి కుటుంబ సభ్యులు మహిళా సంఘాల సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేసి సత్యవేణిది హత్యగా నిర్ధరించారు. అయితే నిందితులు బెయిలు తీసుకుని దర్జాగా తిరుగుతున్నారని.. వారిని అరెస్టు చేయాలని కోరుతూ సత్యవేణి బంధువులు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
'హత్య కేసు నిందితులను అరెస్టు చేసి మాకు న్యాయం చేయండి..!' - కాకినాడ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పండూరు గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన మహిళను భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే నిందితులు బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారని వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు.
" సత్యవేణికి న్యాయం చేయాలి... నిందితులను అరెస్టు చేయాలి"