ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ఆత్మహత్యకు యత్నించిన భార్య - సూరంపాలెం

వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. కొంతకాలంగా మనస్ఫర్థలతో మాట్లాడుకోవడంలేదు. ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చుకుందామని భర్తను కలిసేందుకు అతడు పనిచేసే కళాశాలకు వచ్చింది. అయితే కాలేజీ యాజమాన్యం అందుకు అంగీకరించలేదు. మనస్తాపంతో కళాశాల భవనం ఎక్కి దూకేందుకు ప్రయత్నించింది.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ఆత్మహత్యకు యత్నించిన భార్య

By

Published : Aug 23, 2019, 2:00 PM IST

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన అనసూయ అనే వివాహితను కళాశాల సిబ్బంది కాపాడారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన అనసూయ.. విశాఖ జిల్లా రావికమతం గ్రామానికి చెందిన శివను ప్రేమవివాహం చేసుకుంది. కొంతకాలంగా ఆమెకు, శివకు మధ్య మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం. అధ్యాపకుడిగా పనిచేస్తున్న శివను చూడాలని ఆమె యాజమాన్యాన్ని అడిగింది. వారి నుంచి సరైన సమాధానం లేకపోవటంతో బలవన్మరణ ప్రయత్నం చేసింది.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ఆత్మహత్యకు యత్నించిన భార్య

ABOUT THE AUTHOR

...view details