ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్తకు బ్లాక్ ఫంగస్.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య - black fungus news

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​ ఆసుపత్రి గదిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్తకు బ్లాక్ ఫంగస్ రావడంతో మనోధైర్యం కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

women suicide at kakinada ggh
భర్తకు బ్లాక్ ఫంగస్ సోకిందని మనస్తాపంతో భార్య ఆత్మహత్య

By

Published : May 26, 2021, 10:59 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్త బ్లాక్ ఫంగస్​తో చికిత్స పొందుతుండగా.. ఆయనతో పాటు ఉన్న భార్య బుల్లిమావతి(48) మనస్తాపంతో ఆసుపత్రి గదిలోనే ఆత్మహత్య చేసుకుంది.

పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన తిరుపారెడ్డి, భార్య బుల్లిమావతికి కోవిడ్ సోకింది. చికిత్స అనంతరం కోలుకున్నారు. తిరుపారెడ్డికి బ్లాక్ ఫంగస్ రావడంతో కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు. భర్తకు వ్యాధి నయమవుతుందో లేదోనన్న అనుమానంతో.. మనోధైర్యం కోల్పోయిన మహిళ ఈ ఉదయం ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details