తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఒక ఇంట్లో పనిమనిషిగా చేరి బంగారు వస్తువులు కాజేసిన మహిళ నుంచి 23 కాసుల బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమలాపురంలోని కల్వకొలను వీధిలో పీ అనంతలక్ష్మి అనే మహిళ ఇంట్లో గుంటూరు జిల్లాకు గురజాలకు చెందిన మేరీ సునీత ఈ నెల 3న పనిమనిషిగా చేరింది. చేరిన రోజే ఆ ఇంట్లో నుంచి 23 కాసుల బంగారు వస్తువులను దొంగిలించి పరారైంది. బాధితులిచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అమలాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సునీతని పట్టుకుని ఆమె నుంచి ఇరవై మూడు కాసులు బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వై మాధవరెడ్డి తెలిపారు. చోరీకి పాల్పడిన మహిళపై గతంలో 11 కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు.
పనిమనిషిగా చేరిన రోజే బంగారం చోరీ.. - తూర్పు గోదావరిలో మహిళా దొంగను పట్టుకున్న పోలీసులు
ఇంట్లో పనిమనిషిగా చేరిన రోజే ఓ మహిళ బంగారం చోరీ చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె నుంచి 23 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పనిమనిషిగా చేరిన రోజే బంగారం కాజేసింది.. చివరకు పోలీసుల చేతికి చిక్కింది