తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో సూర్యారావుపేట ఓ చిన్న గ్రామం. రిజర్వేషన్ల పద్ధతిలో ప్రభుత్వం ఆ గ్రామ సర్పంచ్ పదవిని ఎస్టీకి కేటాయించింది. గ్రామంలో ఈ వర్గం ఓటరు ఒక్క రీటా చెల్లాయమ్మ మాత్రమే ఉన్నారు. అంతే ఇక రీటా చెల్లాయమ్మే సర్పంచ్ అని గ్రామస్థులు నిర్ణయించారు. జిల్లాలోని వైరామవరం మండలం పి.ఎర్రగొండకు చెందిన చెల్లాయమ్మను... సూర్యారావుపేటలోని బీసీ కులానికి చెందిన శ్రీనివాసరావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎవరిని పెళ్లి చేసుకున్నా కులం మారదు కాబట్టి ఈమె ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారే అవుతారని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికలు కాకమునుపే ఆ గ్రామ నూతన సర్పంచ్ ఎన్నిక - women elected as sarpanch before elections at east godavari
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం సూర్యారావుపేట నూతన సర్పంచ్ రీటా చెల్లాయమ్మకు పలువురు అభినందనలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే సర్పంచ్ ఎన్నిక ఏమిటా అని అనుకుంటున్నారా... ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లే దీనికి కారణం అంటున్నారు గ్రామస్థులు.

తూర్పుగోదావరిలో ఎన్నికలకు ముందే సర్పంచ్‌గా ఎన్నికయ్యిన మహిళ