తూర్పు గోదావరి జిల్లా మండపేట శివారు పంట పొలాల్లో ఓ వివాహిత మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. ఆలమూరు రహదారిలోని శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీస్ సమీప పొలంలో గుర్తు తెలియని వివాహిత మృతదేహాన్ని స్థానిక రైతులు గుర్తించారు. సుమారు 25ఏళ్ల వయసున్న వివాహిత తగలబెట్టిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హతురాలి తలకు తీవ్ర గాయమై ఉంది. మహిళను ఎవరో చంపి...ఆ పై దహనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళకు సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.
పంటపొలాల్లో లభ్యమైన వివాహిత మృతదేహం - rajamandray
పంటపొలాల్లో సగం కాలిపోయిన మహిళ మృతదేహం లభించడం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కలకలం రేపుతోంది.
పంటపొలాల్లో లభ్యమైన వివాహిత మృతదేహం