తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట వద్ద ఆటోను లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం నుంచి అన్నవరంలో.. వ్యవసాయ పనులకు ఆటోలో వచ్చి తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో గింజల లక్ష్మి మృతి చెందగా, మరో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి. 108 వాహనంలో వీరిని తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఆటోను ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి - తుని రోడ్డు ప్రమాదాలు
వ్యవసాయ పనులకు వెళ్లి.. తిరగొస్తుండగా ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో.. ఐదుగురికి గాయలయ్యాయి. ఈ విషాదం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
ఆటోను ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి