ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆవేశంతో గోదావరిలో దూకిన వివాహిత.. కాపాడిన యువకులు - east Godavari district latest news

తూర్పుగోదావరి జిల్లా రాఘవేంద్రపురం గ్రామానికి చెందిన ఓ వివాహిత కోరంగి వంతెన పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. సమీప పొలాల్లో పనుల్లో ఉన్న యువకులు గుర్తించి సమయస్ఫూర్తితో రక్షించారు.

woman suicide attempt at Godavari river
ఆవేశంతో గోదావరిలో దూకిన వివాహిత

By

Published : Jan 30, 2021, 7:35 PM IST

ఆవేశంతో గోదావరిలో దూకిన వివాహిత.. కాపాడిన యువకులు

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం రాఘవేంద్రపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి..కొన్నేళ్లుగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తుండేది. కరోనా ప్రభావంతో గత ఏడాది విదేశాల నుంచి వచ్చింది. ఆమె విదేశాల్లో ఉన్న సయమంలో పంపే డబ్బుతో భర్త శ్రీనివాస్.. పిల్లల పోషణ చూసుకునేవాడు. ఈ క్రమంలో వ్యసనాలకు బానిసయ్యాడు. అయితే ఈ మధ్య డబ్బు ఇవ్వాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు.

క్రమేపి చిత్రహింసలు ఎక్కువయ్యాయని.. బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే స్థానిక జాతీయ రహదారి మీద ఉన్న వంతెనపై నుంచి దూకింది. అదే సమయంలో సమీప పొలాల్లో పనుల్లో ఉన్న యువకులు గుర్తించి ఆమెను కాపాడారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్త శ్రీనివాస్​ను పిలిపించి మందలించారు.

సరైన సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి మహిళ ప్రాణాలు కాపాడిన యువకులను పోలీసులు అభినందించారు.

ఇదీ చదవండి

అధికార పర్యటన పేరుతో ప్రచారం చేసేందుకు వీల్లేదు: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details