తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పజుల్లాబాద్ గ్రామానికి చెందిన నల్లంసెట్టి లక్ష్మీపార్వతి.. విద్యుదాఘాతానికి గురై బుధవారం రాత్రి మృతిచెందింది. ఈదురు గాలులకు వైర్లు తెగి లక్ష్మీపార్వతి పై పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని.. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
విద్యుత్ తీగలు తెగిపడి మహిళ మృతి - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు
తూర్పుగోదావరి జిల్లా పజుల్లాబాద్లో విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు తెగిపడి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
![విద్యుత్ తీగలు తెగిపడి మహిళ మృతి woman death with current shock in pajullabad east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8224776-1084-8224776-1596051689131.jpg)
విద్యుత్ తీగలు తెగిపడి మహిళ మృతి