తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలోని వాలంటీర్ ఇంట్లో బాధితురాలి బంధువులు అద్దెకు ఉండేవారు. ఫలితంగా వివాహితకు, వాలంటీర్కు పరిచయం ఏర్పడింది. వాలంటీర్ తనను పెళ్లిచేసుకుంటానని చెప్పి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను ఉంచి.. అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో జరిగిన పెద్ద మనుషుల పంచాయితీలో వాలంటీర్.. ఫొటోలు తొలగిస్తానని చెప్పినా.. నేటికీ వాటిని తీసేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై స్పందించిన వాలంటీర్.. తాను ఎటువంటి అకౌంట్ క్రియేట్ చేయలేదని, మహిళ బంధువులే తనపై దాడి చేసి ప్రభుత్వం ఇచ్చిన చరవాణిని లాక్కున్నారని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామ వాలంటీర్ వేధింపులు... వివాహిత ఆందోళన - కొప్పవరంలో ధర్నా
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో ఓ వివాహిత ఆందోళనకు దిగింది. స్థానిక గ్రామ వాలంటీర్ తన పేరుపై ఫేస్బుక్లో ఖాతా తెరచి.. అందులో తన ఫొటోలు పెట్టి మానసికంగా వేధిస్తున్నాడని కుతుకులూరు గ్రామానికి చెందిన వివాహిత.. ఆ గ్రామ వాలంటీర్ ఇంటి ఎదుట ఆందోళన చేసింది.

గ్రామ వాలంటీర్ ఇంటి ఎదుట వివాహిత ఆందోళ
Last Updated : Jun 19, 2020, 9:17 PM IST