ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వినియోగించిన విద్యుత్​కే బిల్లులు వస్తున్నాయి' - విద్యుత్ బిల్లులపై దాడిశెట్టి రాజా కామెంట్స్

విద్యుత్ ఛార్జీలు పెంచారని, విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని తెదేపా నాయకులు పుకార్లు సృష్టించి రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగించిన విద్యుత్​కే బిల్లు వస్తుందని స్పష్టం చేశారు.

wip dhadishetti raja on electriciry bill
wip dhadishetti raja on electriciry bill

By

Published : May 17, 2020, 3:44 PM IST

తూర్పుగోదావరి జిల్లా తునిలో మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతు బజార్​ను దాడిశెట్టి రాజా ప్రారంభించారు. లాక్​డౌన్​తో ప్రజల విద్యుత్ వినియోగం పెరిగిందని.. దీనివల్లే.. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అంతేగానీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని రాజా ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details