తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఆ ప్రాంత పరిధిలో ఐదుగురికి కరోనా సోకిన కారణంగా.. సంపూర్ణ లాక్డౌన్ విధస్తున్నట్లు అమలాపురం ఆర్డీవో భవానీ శంకర్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ క్రమంలో మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించారు. కానీ.. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా దుకాణాలు తెరుచుకున్నాయి.
ఎక్సైజ్ అధికారులు ఫోన్ చేసి దుకాణాలు తెరవమన్నారనీ, అందుకే తెరిచామని సేల్స్ మెన్ చెప్పారు. నిత్యావసర దుకాణాలు మాత్రం 10 గంటలకే పోలీసులు మూసివేయించారు. 10 గంటల తరువాత ఇంటి బయట ఎవరు కనిపించినా కేసులు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు... మద్యం షాపులు తెరచి విక్రయాలు జరుపుతున్నా మాట్లడకపోవటం విమర్శలకు కారణమైంది.