ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త హత్య జరిగిన ఐదు రోజుల్లో భార్య ఆత్మహత్య - suicides in pitapuram news

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్త మరణించిన ఐదు రోజుల్లోనే.. భార్య బలవర్మరణానికి పాల్పడిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

suicide
ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

By

Published : Feb 13, 2021, 8:27 AM IST

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రెడ్డెం స్వరూపారాణి ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. ఈ నెల 8న మృతురాలి భర్త శ్రీనివాస్.. ఇంట్లో నిద్రిస్తుండగా మంచానికి కట్టేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో స్వరూపారాణి బలవర్మరణం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details