ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య ఆత్మహత్య చేసుకుందేమోనని...గోదావరిలో దూకిన భర్త - తూర్పుగోదావరిలో భార్య ఆత్మహత్య బ్లాక్ మెయిల్ భార్య ఆత్మహత్య

వారిద్దరికి మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. 11 నెలల బాబు కూడా ఉన్నాడు. కానీ మనస్పర్థలతో తరచూ గొడవలు పడేవారు. ఆదివారం రాత్రి కూడా గొడవ పడ్డారు. సోమవారం ఉదయం భార్య ఇంట్లో లేదు. గోదావరి ఒడ్డున ఆమె చెప్పులు కనిపించాయి. భార్య గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుందని ఆందోళన చెందిన భర్త ...గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. ఇంతకి ఆమె వేరే చోట ఉందని పోలీసులు గుర్తించారు. అతని ఆచూకీ లభ్యం కాలేదు.

husband suicide
husband suicide

By

Published : Dec 14, 2020, 10:50 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం... మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన వెంకట రవి కుమార్​తో పి.గన్నవరం గ్రామానికి చెందిన పుష్ప శివ అనే యువతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆదివారం రాత్రి 11 గంటల సమయం వరకు ఈ దంపతులు ఇంట్లోనే ఉన్నారు. ఉదయం భర్త నిద్ర నుంచి లేచేసరికి భార్య కనబడలేదు. బాబు ఇంట్లోనే ఉన్నాడు. దీంతో ఆందోళన చెందిన రవికుమార్ ఆమె కోసం స్థానికంగా వెతికారు. చివరకు గ్రామానికి ఆనుకొని ఉన్న గోదావరి నది ఒడ్డున పుష్ప శివ చెప్పులు చూసి ఆమె కనిపించకపోవడంతో రవి కుమార్ హైరానా పడ్డారు.

భార్య గోదావరిలో దూకి గల్లంతై ఉంటుందని ఆందోళన చెంది... పెదపట్నం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడసకుర్రు వంతెనపై నుంచి రవి కుమార్ గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. పుష్ప శివ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రవి కుమార్ ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details