కోడి కన్నా మేత ప్రియం... మేత లేక కోళ్లు మృత్యువాత - When chickens die in poultry farms
కరోనా వైరస్ ప్రభావంతో కోళ్ల ఫారాల రైతులు తీవ్రనష్టాలు ఎదుర్కొంటున్నారు. లైవ్ కోడి అమ్మకపు ధర కన్నా మేత రేటు ఎక్కువగా ఉండటంతో మేత వేయటం మానేస్తున్నారు రైతులు. మేతలేక రోజుల వ్యవధిలో వేల కోళ్లు మృత్యువాతపడుతున్నాయి.

కోళ్ల ఫారాల్లో కోళ్లు మృత్యువాత
కోళ్ల ఫారాల్లో కోళ్లు మృత్యువాత
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రెండు వందలకు పైగా కోళ్ల ఫారాలున్నాయి. ఈ కోళ్ల ఫారాల్లో నిత్యం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా లైవ్ కోడి ధర కిలో 10 రూపాయలకు పడిపోయింది. కోడి అమ్మకానికి కన్నా మేత ధర అధికంగా ఉండటంతో మేత వేయడం తగ్గించేస్తున్నారు రైతులు. ఈ కారణంగా నిత్యం ఒక్కో కోళ్ల ఫారంలో 5 వేల నుంచి 10 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.