ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంటల్లో చిక్కుకుంటే ఏం చేయాలి? - What to do if caught in flames at mummudivaram

అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు.. సమయానుకూలంగా ఎలా ప్రవర్తించాలి.. ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలి? అన్న విషయాలను ముమ్ముడివరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కలిగించారు. తుపానులు, వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో సాహసోపేతంగా సిబ్బంది చేసే రక్షణ చర్యలను వివరించారు.

What to do if caught in flames at mummudivaram eastgodavari district
మంటల్లో చిక్కుకుంటే ఏం చేయాలి?

By

Published : Nov 26, 2020, 10:17 AM IST

తూర్పు గోదావరి జిల్లా ముమ్ముడివరం ప్రభుత్వ పాఠశాలలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన సందర్భంలో ఎలా స్పందించాలి అనే విషయం వివరించారు. తక్షణం ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఏ విధంగా స్పందించాలి అన్న విషయాలను చెప్పారు.

అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సిబ్బంది మంటలను ఏ విధంగా అదుపు చేస్తారు...బాధితులను ఎలా రక్షిస్తారు అన్నది.. మాక్​ డ్రిల్​ ద్వారా చూపించారు. తుపానులు, వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో సాహసోపేతంగా సిబ్బంది చేసే రక్షణ చర్యలను వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details