తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తంలో రూ.25 లక్షలతో రక్షిత మంచినీటి పథకం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.15 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఎస్సీ సామాజికవర్గ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు.
తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాం అంకిత భావంతో పని చేయాలి..
వైకాపా ప్రభుత్వంలో కీలకమైన గ్రామ వాలంటీర్లు అంకితభావంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. వివిధ గ్రామాలకు చెందిన గ్రామ వాలంటీర్లకు అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో నియామక ఉత్తర్వులు అందజేశారు.
ఇదీ చదవండి: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ఏఐవైఎఫ్ అధ్వర్యంలో ధర్నా