ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఒక్కో కుటుంబానికి రూ.5వేలు పరిహారం' - We will help flood victims: Ministers Nani, Kannababu

వరద ముంపునకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వనున్నట్టు మంత్రులు ఆళ్లనాని, కన్నబాబు తెలిపారు. బాధితుందరికీ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు.

'ఒక్కో కుటుంబానికి రూ.5వేలు పరిహారం'

By

Published : Aug 8, 2019, 6:38 PM IST

వరద బాధితులను ఆదుకుంటాం..
వరద బాధిత ప్రాంతాల్లో సీఎం విహాంగ వీక్షణం తర్వాత మంత్రులు ఆళ్లనాని, కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో సాగు చేస్తూ నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు అందజేస్తామని అన్నారు. 20 వేలకు పైగా కుటుంబాలకు నిత్వావసరాలు ఇస్తున్నామని ప్రకటించారు. కాఫర్ డ్యాం నిర్మాణంతో తీవ్రమైన నష్టం జరిగిందని.. వచ్చే ఏడాది విపత్తు వచ్చినా నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. నిర్వాసితుల కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని మంత్రులు ఆరోపించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో గిరిజనులతోపాటు గిరిజనేతరులకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details