ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలు మానుకొని... హామీల అమలుపై దృష్టిపెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సూచించారు. కేసుల పేరుతో మాజీ ఎంపీ హర్షకుమార్‌ను వేధించడం సరికాదని హితవుపలికారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలను అణగదొక్కే చర్యలు ఆపకపోతే... ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులపై తనకు నమ్మకం లేదని చెప్పారు. తెలంగాణలో పశువైద్యురాలిపై లైంగికదాడి ఘటన దారుణమన్నారు. దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
'కక్ష సాధింపులు మానుకోండి... పాలనపై దృష్టి పెట్టండి' - ప్రియాంక రెడ్డి ఘటనపై మాజీ ఎంపీ వి. హనుమంతరావు వ్యాఖ్యలు
సీఎం జగన్ కక్ష సాధింపులు చర్యలు మానుకొని... హమీల అమలుపై దృష్టిపెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సూచించారు. శంషాబాద్‌లో పశువైద్యురాలి ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎంపీ వి. హనుమంతరావు
TAGGED:
ex mp comments on ycp