తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గత కొన్ని రోజులుగా నీటి సమస్య నెలకొంది. గోదావరిలో నీటి లభ్యత అడుగంటిపోవడంతో ఆ ప్రభావం చెరువులపై పడింది. సామర్లకోటలోని సాంబమూర్తి రిజర్వాయర్ నుంచి నగరానికి నీటి సరఫరా తక్కువ కావటంతో.. నగరవాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతోపాటు అరిట్లకట్ట చెరువు నుంచి కూడా నీటి సరఫరా తగ్గిపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. సమస్యను గ్రహించిన అధికారులు.. కుళాయిల ద్వారా, ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తున్నారు. అయినప్పటికీ నీరు సరిపోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాకినాడలో తాగునీటి కష్టాలు.. నీరందక నగరవాసుల ఇక్కట్లు - news updates in kakinada
స్మార్ట్ సిటీ అయిన కాకినాడలో నీటి ఎద్దడి నెలకొంది. నగరానికి తాగునీరు సరఫరా చేసే చెరువుల్లో నీటి నిల్వలు నిండుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా కుళాయిల ద్వారా అందించే నీటి సరఫరాను నగరపాలక సంస్థ కుదించింది. దీంతో చేసేది ఏమీ లేక నగరవాసులు ట్యాంకుల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు.
కాకినాడలో తాగునీటి కష్టాలు
కాకినాడలోని డ్రైవర్స్ కాలనీలో తాగునీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో పైపులైన్ వేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని కాకినాడ నగరంతో పాటు పెద్దాపురం, సామర్లకోట పురపాలక సంఘాలకూ నీటి సమస్య తీవ్రం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీచదవండి.