తూర్పుగోదావరి జిల్లా మన్యంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం మండలం భూపతిపాలెం, ముసురుమిల్లి జలాశయాలు నిండుకుండల్లా మారాయి. భూపతిపాలెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 204 మీటర్లు కాగా.. ఇప్పటికి 203.5 మీటర్లకు నీరు చేరింది. దీంతో ఒక గేటును ఎత్తి 150 క్యూసెక్కులు నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి అధికారులు విడుదల చేశారు.
భూపతిపాలెం జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల
తూర్పుగోదావరి జిల్లా రంచోడవరం మండలం భూపతిపాలెం జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి జలాశయం నీటిమట్టం పెరగటంతో ఒక గేటు ఎత్తి సీతపల్లి వాగుకు నీరు వదిలారు.
భూపతిపాలెం జలాశయం