పోలవరం(polavaram) ప్రాజెక్టు పనుల ప్రగతిపై వర్చువల్ విధానం ద్వారా మంత్రి అనిల్‌కుమార్ సమీక్షించారు. పోలవరం(polavaram) ప్రాజెక్టు పనులకు ఆటంకం లేకుండా ఖరీఫ్‌కు నీరందివ్వడంపై చర్చించారు. రుతుపవనాలు రాకముందే ఎగువ కాఫర్ డ్యాం వద్ద పనులు పూర్తిచేయాలని, దీనికోసం సీలేరు వద్ద విద్యుత్ ఉత్పత్తిని జూన్ 5 వరకూ నిలుపేయాలని నిర్ణయించారు. జూన్ 15 వరకూ తూర్పుగోదావరి జిల్లాలో తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని జిల్లా యంత్రాంగం తెలిపింది.
polavaram: జూన్ 15 నుంచి పోలవరం స్పిల్‌వే మీదుగా నీరు విడుదల! - AP News
జూన్ 15 నుంచి రివర్ స్లూయిస్ల నుంచి పోలవరం(polavaram) స్పిల్‌వే మీదుగా నీటిని విడుదల చేయాలని... జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటకు నీరిచ్చే అంశంపై మంత్రి అనిల్ సమీక్ష నిర్వహించారు. విజయవాడలో జరిగిన సమావేశంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీలు అనురాధ, భరత్ ఆయా జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![polavaram: జూన్ 15 నుంచి పోలవరం స్పిల్‌వే మీదుగా నీరు విడుదల! జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11922191-926-11922191-1622125796041.jpg)
పశ్చిమగోదావరి జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తవచ్చని తగు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. గుర్తింపు పొందిన కాలువ వ్యవస్ధకు వార్షిక మెయింటెనెన్స్ చేపట్టేలా చర్యలు ఉండాలని మంత్రి కన్నబాబు సూచించారు. దీనివల్ల ఏలేరు ఆయకట్టు కింద సాగునీటి అవసరాలు ఏ మేరకు వృద్ధి అవుతాయో పరిశీలించాలన్నారు. రైతుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు నిర్ణయాల పట్ల విస్తృత ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇదీ చదవండీ... CM Jagan Review: 'ఫౌండేషనల్ స్కూళ్ల తర్వాత డిజిటల్ బోధనపై దృష్టి పెట్టాలి'