తూర్పుగోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం మురుమళ్ల, కేశనకుర్రు గ్రామ పంచాయతీల పరిధిలోని ఏటిగట్టుకు గండి పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రవాహం భారీగా పెరగడంతో గట్టును తాకుతూ నీరు ప్రవహిస్తోంది. గట్టు కింద నుంచి లీకేజీలు ఏర్పడి పంట కాలువలోకి నీరు చేరుతుంది. అంతకంతకూ నీటి ప్రవాహం పెరుగుతుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లీకేజీలు మరింత పెరిగే అవకాశం ఉందని అదే జరిగితే నాలుగు గ్రామాల పరిధిలోని పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.
ఏటిగట్టుకు గండి పడే అవకాశం..ఆందోళనలో గ్రామస్థులు - గోదావరి వరదలు
తూర్పుగోదావరి జిల్లా ఐ. పోలవరం మండలం మురుమళ్ల, కేశనకుర్రు గ్రామ పరిధిలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏటిగట్టుకు గండి ప్రమాదం ఉందని...ఇప్పటికే కొన్ని చోట్ల నీరు లీకేజీ అవుతుందని అంటున్నారు. తక్షణమే లీకేజీలను కట్టడి చేయాలని కోరుతున్నారు.
![ఏటిగట్టుకు గండి పడే అవకాశం..ఆందోళనలో గ్రామస్థులు eastgodavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8520392-701-8520392-1598114053546.jpg)
eastgodavari district