చేతిపంపును ఎవరూ తాకకుండానే నీరు వస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా..! తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఓ చేతిపంపు వద్ద నీరు ధారళాంగా వస్తున్నాయి. గోదావరికి వరద నీరు భారీగా చేరడంతో లంక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అధికంగా పెరిగాయి. ఈ క్రమంలో అంకంపాలెం గ్రామం గోదావరి చెంతన ఉండడంతో చేతి పంపు కొట్టకుండానే నీరు వచ్చింది. ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
కొట్టకుండానే చేతిపంపు నుంచి నీరు..! - అంకంపాలెంలో చేతిపంపు తాజా వార్తలు
చేతిపంపును చేతితో కొడితేనే నీరు వస్తుంది.... అటువంటిది ఎవరు కొట్టకుండానే పంపు నుంచి నీరు ధారాళంగా వస్తోంది. అవును మీరు విన్నది నిజమే..! అలా నీళ్లు వచ్చే ప్రాంతం ఎక్కడో తెలుసుకుందామా..!
![కొట్టకుండానే చేతిపంపు నుంచి నీరు..! Water is coming from the hand pump without anyone touching it at ankampalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8473790-978-8473790-1597818790254.jpg)
అంకంపాలెంలో చేతిపంపు
Last Updated : Aug 19, 2020, 1:35 PM IST