ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతోపాటు తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా చుట్టేశాయి. ఈ ప్రభావంతో ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నిండుకుండలా మారిన భూపతిపాలెం జలాశయం - water full in Bhupathipalayam revere
రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పడుతున్న వర్షాలకు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో భూపతిపాలెం జలాశయం నీటితో నిండింది.
water full
తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లో నీరు కళకళలాడుతోంది. భూపతిపాలెం జలాశయం నీటితో నిండింది. దీనితో ప్రస్తుత ఖరీఫ్ లో పంట కాలువలకు నీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు ఇలాగే పడితే జలాశయం గేట్లు ఎత్తే అవకాశం వుంది.
ఇదీ చదవండి:అచ్చెన్నాయుడి కిడ్నాప్‌కు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు