తూర్పుగోదావరి జిల్లా కోనసీమ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కొత్తపేట నియోజక వర్గంలోని లంక పొలాలు నీటమునిగాయి. లంక ప్రాంతాల్లో ఉండే కూరగాయల తోటలు నీటమునగడంతో రైతులు పడవలపై వెళ్లి కూరగాయలను రైతులు తెచ్చుకుంటున్నారు. ఇటుక బట్టీలు పూర్తిగా మునిగిపోయాయి. రావులపాలెం గోపాలపురంలోని గౌతమి వశిష్ఠ వంతెన వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది.
జిల్లాలోని 19 మండలాల్లోని గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంది. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయు. గ్రామాల్లోకి వరదనీరు చేరటంతో గిరిజనులు కొండలపై ఉంటున్నారు. చట్టి, వీరాపురం వద్ద జాతీయ రహదారిపైకి వరదనీరు చేరింది. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా ఛత్తీస్‌గఢ్ వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.