తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో ప్రధాన పంట కాలువ నుండి నీరు పొర్లుతోంది. సమీప గ్రామాల్లోని నివాసాల వద్దకు ఈ నీరు చేరుతుంది. ఇప్పటికే చెత్తగా ఉన్న గ్రామాల్లో ఈ కాలువ నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలకుకాలువ నీరు అవసరం లేకున్నా ఇరిగేషన్ సిబ్బంది నీటిని విడుదల చేయటంతోనే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు. ప్రభుత్వం పేదలకు పంచేందుకు సిద్ధం చేసిన లే అవుట్ లోనికి కాలువ నీరు చేరింది. ఇరిగేషన్ అధికారులు తక్షణం పంట కాలువలో నీటి విడుదలను నిలిపివేయాలని ఆందోళనకు దిగారు.
పంట కాలువ నీటితో గ్రామాలకు ముంపు - Waste of water from the canal in Mummidivaram
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో ప్రధాన పంట కాలువ నుండి నీరు పొర్లి సమీప గ్రామాల్లోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పంట కాలువ నీటితో గ్రామాలకు ముంపు