తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఘాట్ రోడ్డులో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఘాట్ రోడ్డులో కొంత మంది భక్తులకు కొండచిలువ కనిపించింది. అధికారులు బందించేలోపే రాళ్ల మధ్యకు వెళ్లిపోయింది. అయితే మరో కొండచిలువ ఘాట్ రోడ్డు పైకి రావటంతో కొంతమంది ఆటో డ్రైవర్లు హతమార్చారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు అవగాహన కల్పించే విధంగా బోర్డులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవగాహన, అప్రమత్తత కోసమే బోర్డులు పెట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.
అన్నవరం ఘాట్ రోడ్డులో కొండచిలువలున్నాయి.. భక్తులూ జాగ్రత్త..! - అన్నవరంలో కొండచిలువల తాజా న్యూస్
ఈ ఘాట్ రోడ్డులో కొండచిలువలు సంచరిస్తున్నాయి... దయచేసి భక్తులు జాగ్రత్తగా ప్రయాణించవలెను... అంటూ అన్నవరం దేవస్థానం ఘాట్ రోడ్డులో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ ప్రాంతంలో వరుసగా రెండు కొండచిలువలు కనిపించిన నేపథ్యంలో భక్తులకు అవగాహన కల్పించే విధంగా బోర్డులు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

అన్నవరం దేవస్థానం ఘాట్ రోడ్డులో హెచ్చరిక బోర్డులు