ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం..? - తూర్పుగోదావరిలో విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం చేసిన ఘటన ఇది. బాధితురాలిని బెదిరించి రెండున్నర రోజులు నరకం చూపాడు ఓ రాక్షసుడు.

warden raped student
గిరిజన విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం..?

By

Published : Jan 24, 2020, 7:37 PM IST

గిరిజన విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం..?

ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వార్డెన్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 21న పాఠశాలకు వెళ్లిన విద్యార్థినిపై వార్డెన్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తన గదికి రాకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తానని... తన చెల్లిని బెదిరించాడని బాధితురాలి అన్నయ్య వాపోయాడు.

రెండున్నర రోజులపాటు విద్యార్థినిపై అత్యాచారం చేశాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు వార్డెన్​ను అరెస్టు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు ఐటీడీఏ పీవో నిశాంత్ కుమార్ చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: పాఠశాల బస్సు ఢీకొని బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details