కాకినాడ మేయర్ పావని ఇంటి వద్ద అపరిచితుల సంచారం - ఏపీ లేటెస్ట్ న్యూస్
12:55 September 22
వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడిపై మేయర్ పావని ఆరోపణలు
కాకినాడ మేయర్ పావని ఇంటి వద్ద అపరిచితులు సంచారం ఆందోళన కల్గిస్తోంది. మేయర్ ఇంటికి వచ్చే ప్రతీ ఒక్కరిని దుండగులు ఫొటో తీస్తున్నారు. మీడియా ప్రతినిధుల ఫొటోలు తీయడంతో వాగ్వాదం చెలరేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేయడంతో దుండగులు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ విషయంపై స్పందించిన మేయర్ పావని... వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఆరోపణలు చేస్తోంది. మేయర్‌గా తనను తప్పించాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని తెలిపింది. ఎమ్మెల్యే ద్వారంపూడి, మేయర్ పావనిల మధ్య కొద్దిరోజులుగా వార్ కొనసాగుతోంది.
ఇదీ చూడండి:GANDHIJI: గాంధీజి కొల్లాయి (ధోవతి) కట్టి నేటికి వందేళ్లు